ఆకాష్ పూరి రొమాంటిక్ ఫస్ట్ లుక్

పూరి జగన్నాధ్ సినిమా అంటేనే మాస్, రొమాంటిక్ సీన్స్ గుర్తుకువస్తాయి. ఇప్పడు పూరి నిర్మాతగా ఆయన కొడుకు ఆకాశ్ హీరోగా రొమాంటిక్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయ తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోమవారం రిలీజైంది. టైటిల్ కి తగ్గట్టుగానే సినిమాను పూరి తన స్టైల్ లో రూపొందిస్తున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తేనే తెలుస్తుంది. హీరో, హీరోయిన్ కౌగిలించుకున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ లో చూపించి యూత్ కి పిచ్చెక్కించారు. అనిల్ పాదూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఆకాశ్ సరసన..కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్ప‌టికే సినిమా హైద‌రాబాద్‌, గోవా షెడ్యూల్స్‌ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సోమ‌వారం నుండి కొత్త షెడ్యూల్ హైద‌రాబాద్‌ లోనే ప్రారంభం కానున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది యూనిట్. ఇస్మార్ట్ శంక‌ర్‌ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌ పై  పూరి, చార్మి ఈ సినిమాను నిర్మించడంతో..ఈ రొమాంటిక్ మూవీపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.

 

Latest Updates