నా వల్లే హైదరాబాద్ కు మెట్రో .. కానీ నా ఏరియాకు రాలే

తన వల్లే హైదరాబాద్ కు మెట్రో వచ్చిందన్నారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ.. కానీ తన ఏరియాకు మెట్రో రాలేదన్నారు. పట్టణీకరణపై చర్చ సందర్భంగా మాట్లాడిన అక్బరుద్దీన్..ఓల్డ్ సిటీకి  మెట్రో ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు .  గోదావరి,కృష్ణ నీటికోసం తాను జనార్థన్ రెడ్డితో కలిసి పోరాడానన్నారు. పాతబస్తీకి మంచి నీరు కూడా అందడం లేదన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం తాము పోరాడామన్నారు.

ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని కేసీఆర్ అన్నారు కానీ ఇంత వరకు చేసింది లేదు. 400 ఏళ్లుగా ఓల్డ్ సిటీ సౌకర్యాల కోసం అల్లాడుతుందన్నారు. ఓల్డ్ సిటీలో చాలా పర్యాటక ప్రాంతాలున్నాయన్నారు. దశాబ్దాలుగా ఓల్డ్ సిటీలో రోడ్ల వెడల్పు పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఓల్డ్ సిటీ కోసం రూ. 10 వేల కోట్లు కేటాయించండన్నారు. చార్మినార్ పనులు ముందుకు సాగడం లేదన్నారు. చార్మినార్ దగ్గర పార్కింగ్ ప్లేస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందన్నారు. లాడ్ బజార్ ను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు.

ఇంత వర్షాలు పడినా గండిపేట, హిమాయత్ సాగర్లో నీళ్లు లేవన్నారు. హుస్సేన్  సాగర్ 4 వేల ఎకరాల్లో ఉండేదని ఇపుడు వెయ్యి ఎకరాలకు వచ్చిందన్నారు. ఇండస్ట్రీయల్ వేస్టేజ్ హుస్సేన్ సాగర్లోకి వస్తుందన్నారు. హుస్సేన్ సాగర్ ను ఎపుడు బాగు చేస్తారని ప్రశ్నించారు. మూసీనది ఎపుడు సాఫ్ అవుతుందన్నారు.శానిటైజేషన్ సిబ్బంది సేవ వెలకట్టలేనిదని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. కరోనా టైంలో పనిచేసిన హెల్త్ వర్కర్లకు ధన్యవాదాలు తెలిపారు. సిటీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు. 20 ఏళ్లలో హైటెక్ సిటీ భారత న్యూయార్స్ గా మారిందన్నారు.

Latest Updates