బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు: ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన భార్గవ్ రామ్

హైదరాబాద్: బోయిల్ పల్లి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న అఖిలప్రియభర్త భార్గవ్ రామ్.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరుపు లాయర్లు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు.బోయిన్ పల్లి కిడ్నాప్ జరిగిన నాటి నుండి భార్గవ్ రామ్ పరారీలో ఉన్నాడు. భార్గవ్ రామ్ తో పాటు జగత్ విఖ్యాత్ రెడ్డి, చంద్రహాస్, గుంటూరు శ్రీను, భార్గవ్ రామ్ కుటుంబసభ్యులు పోలీసులకు చిక్కకుండా ఉన్నారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న భార్గవ్ రామ్ కోసం పోలీస్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. అయితే ఈ సమయంలో భార్గవ్ రామ్.. సోమవారం నాడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టు.. పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తర్వాతి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

Latest Updates