ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ…రేపు కోర్టుకు హాజరు

హైదరాబాద్ బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మూడు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణలో ఆమె నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు మొదట దాటవేసేందుకు ప్రయత్నించిన అఖిలప్రియ… ఆ తర్వాత కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్టు సమాచారం. సాంకేతిక ఆధారాలను కూడా ముందుంచడంతో… కొన్నింటిని ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

రేపు(గురువారం)మధ్యాహ్నం అఖిలప్రియను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. తర్వాత  ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించి..ఆ తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించానున్నారు పోలీసులు.

ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates