చంచల్ గూడ జైలు నుంచి పోలీసు కస్టడీకి అఖిలప్రియ

మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియను తెలంగాణ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు చంచల్ గూడ జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత బేగంపేట మహిళా పోలీసు స్టేషన్ కు తరలించారు. మూడు రోజుల పాటు ఆమెను విచారించనున్నారు.

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1గా ఉన్నారు. ప్రస్తుతం ఆమె రిమాండ్ లో ఉన్నారు. ఆమె వేసిన బెయిల్ పిటిషన్ ను ఇవాళ(సోమవారం) కోర్టు కొట్టివేసింది. మరోవైపు కిడ్నాప్ కేసులో విచారణ కోసం ఆమెను 7 రోజుల రిమాండ్ కు ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు మూడు రోజు కస్టడీకి అనుమతించింది.

Latest Updates