పోలీసు కస్టడీకి అఖిలప్రియ సహచరులు

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత స్పీడప్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను ఇవాల పోలీసు కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది. కిడ్నాప్ కేసులో A1 గా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సహచరులు మల్లికార్జున్ రెడ్డి, సంపత్ లను మూడు రోజుల కస్టడీకి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో నిందితులను రేపు(బుధవారం) చంచల్ గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.

కిడ్నాప్ కేసులో ఇప్పటికే అఖిలప్రియతో పాటు 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అఖిలప్రియ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు లాయర్లు కోర్టును కోరారు. అయితే ప్రధాన నిందితురాలిగా ఉన్న  అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేస్తే…దర్యాప్తు పై ప్రభావం చూపే అవకాశముందని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Latest Updates