అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ఈ నెల 18కి వాయిదా

బోయిన్ పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన ముద్దాయి, మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్ విచారణ మళ్ళీ వాయిదా పడింది. అఖిలప్రియ ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్టులను ఆమె తరఫు లాయర్లు కోర్టుకు సమర్పించారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అఖిలకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది వాదనలు విన్పించారు. అయితే అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. సోమవారానికి బెయిల్‌ పిటిషన్‌ విచారణను కోర్టు వాయిదా వేసింది. అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ వేయడం ఇది రెండోసారి.

Latest Updates