ఎస్పీని ఆపడం ఎవరి తరం కాదు

ఎస్పీని ఆపడం ఎవరి తరం కాదు

యూపీలో బీజేపీ వికెట్లు పడిపోతున్నాయని.. యోగి ఆదిత్యనాథ్ కి క్రికెట్ ఆడటం తెలియదని అన్నారు అఖిలేశ్ యాదవ్. అంబేద్కర్ వాది, సమాజ్ వాది కలయికతో సైకిల్ మరింత స్పీడ్ గా ముందుకెళ్తుందన్నారు. ఎస్పీని ఆపడం ఎవరి తరం కాదన్నారు అఖిలేశ్ యాదవ్.. 72 గంటల్లోనే ఇద్దరు మంత్రులతో సహా.. 10 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేసి అఖిలేశ్ యాదవ్ సమక్షంలో.. స్వామి ప్రసాద్ మౌర్య, దరమ్ సింగ్ షైనీ ఎస్పీలో చేరారు. ప్రస్తుతం యూపీలో బలమైన ఓబీసీ నేతగా స్వామి ప్రసాద్ మౌర్య ఉన్నారు.  వెనకబడిన తరగతుల అభివృద్ధిని బీజేపీ మరిచిపోయిందని స్వామి ప్రసాద్ మౌర్య ఆరోపించారు. యూపీలో బీజేపీ భూస్థాపితం చేస్తామన్నారు.