జై జవాన్ : అక్షయ్ కుమార్ సాయం రూ.5కోట్లు

పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు 5 కోట్ల రూపాయలను ఇవ్వనున్నట్లు అక్షయ్ కుమార్ తెలిపారు. ఇదివరకే అమితాబచ్చన్ 2.5 కోట్లను ప్రకటించారు. బిహార్ కు చెందిన ఇనాయత్ ఖాన్ అనే IAS ఆఫిసర్ పుల్వామా ఘటనలో అమరులైన బిహార్ కు చెందిన ఇద్దరు జవాన్ల పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. వీరితో పాటు బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా తనకు తోచిన సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో వచ్చిన ‘ఉరి’ సినిమా నిర్మాత రోనీ..  ‘పుల్వామా దాడి’లో అమరులైన సైనికుల కుటుంబాలకు కోటీ రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పుల్వామా దాడి విషయంలో దేశం మొత్తం కదిలింది. ప్రతీ ఊర్లో క్యాండిల్ ర్యాలీలతో అమరులకు నివాళులు అర్పించారు దేశ ప్రజలు.

Latest Updates