అయోధ్య రామమందిర నిర్మాణానికి అక్షయ్ కుమార్ విరాళం

గతేడాది ఆగస్టు లో ప్రధాని నరేంద్రమోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ నిర్మాణం కోసం రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. మూడు రోజుల్లోనే ఆలయ నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళం వచ్చినట్టు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. పలువురు ప్రముఖులతో పాటు… సినీ నటులు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. రీసెంట్ గా నటి ప్రణీత లక్ష రూపాయల విరాళం అందించగా.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా విరాళం ఇచ్చినట్టు ప్రకటించారు. దేశ ప్రజలందరూ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని.. ఇందుకు బాధ్యతగా ప్రతి ఒక్కరూ విరాళాలు ఇవ్వాలని కోరారు. ఆలయ నిర్మాణానికి ఎంత విరాళం ఇచ్చాడనేది మాత్రం చెప్పలేదు. అక్షయ్ కుమార్ కరోనా లాక్ డౌన్ సమయంలోను ప్రభుత్వానికి భారీగా విరాళం అందించారు.

Latest Updates