వ‌ర‌ద బాధితుల‌కు అక్ష‌య్ కుమార్ సాయం

ముంబై : ‌బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ మ‌రోసారి మంచి మ‌న‌సు చాటాడు. బీహార్, అసోం రాష్ట్రల్లో వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. నాలుగు రోజులుగా కుర్తుస్తున్న భారీ వర్షాలకు బిహార్, అసోం రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్ర‌మిస్తున్నారు.

ఈ క్ర‌మంలో వరద బాధితులను ఆదుకునేందుకు మానవతా హృదయం చాటుకున్నాడు అక్షయ్ కుమార్. రెండు రాష్ట్రల్లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద సంఖ్లో ప్రజలు వరదల్లో చిక్కుకున్నట్లు తెలుసుకున్న ఆయన.. బిహార్, అసోం రాష్ట్రాల ముఖ్యమంత్రుల రిలీఫ్ పండ్ కు రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం చేస్తానని తెలిపాడు. అక్షయ్ కుమార్ ఔదార్యానికి ముఖ్యమంత్రులు ఇద్దరూ కృతజ్ఞతలు తెలిపి ఆయన చేస్తున్న సహాయాన్ని ప్రశంసించారు.

 

Latest Updates