ప్రధాని అవుతాను అనుకోలేదు..ఆర్మీలో చేరాలనుకున్నా : మోడీ

ఢిల్లీ : తాను ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదన్నారు నరేంద్ర మోడీ. ఆర్మీలో చేరి దేశసేవ చేయాలనుకున్నానని చెప్పిన ఆయన… కుటుంబ ప్రమేయంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తాను కఠినంగా ఉంటానని… ఐతే  ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం అనుకోలేదన్నారు. బుధవారం ఉదయం ఢిల్లీలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడారు మోడీ. సన్యాసి జీవితాన్నే ఇష్టపడతానని, తాను పనిచేస్తూ.. మిగతా వారందరితో పని చేయిస్తానన్నారు.  ప్రముఖుల బయోగ్రఫీలు చదవడం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. రామకృష్ణ మిషన్ ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు ప్రధాని. ఇంటర్వ్యూలో పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేని అంశాలపై మాట్లాడారు మోడీ.

సీఎం అయ్యే వరకు బ్యాంకు ఖాతాలేదని తెలిపిన మోడీ.. గుజరాత్‌ ముఖ్యమంత్రిని అయ్యాక ఫస్ట్ జీతం డబ్బు బ్యాంకులో డిపాజిట్‌ అయ్యిందని తెలిపారు. \

Latest Updates