పబ్జీకి దీటుగా కొత్త గేమింగ్ యాప్ ‘ఫౌజీ’: అక్షయ్ కుమార్

కేంద్ర ప్రభుత్వం పబ్జీ మొబైల్ గేమింగ్ యాప్ ను నిషేధించింది. దీంతో అలాంటి ఓ గేమ్ కు సంబంధించి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ లో భాగంగా పబ్జీకి దీటైన మల్టీ ప్లేయర్ గేమ్ ను తీసుకువస్తున్నట్టు తెలిపారు. దీనికి ‘ఫౌజీ’ (FAU-G) అని పేరు పెట్టారు. FAU-G అంటే ‘ఫియర్ లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్’ అని అర్థం.

ఈ గేమ్ ను బెంగళూరుకు చెందిన ఎన్ కోర్ గేమ్స్ సంస్థ రూపొందించింది. అక్షయ్ కుమార్ మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. ఫౌజీ గేమింగ్ యాప్ ద్వారా వినోదం మాత్రమే కాదని, భారత సైనికుల త్యాగాలను కూడా తెలియజేయబోతున్నామని అక్షయ్ కుమార్ తెలిపారు. ఫౌజీ యాప్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం ‘భారత్ కా వీర్’ ట్రస్టుకు అందజేస్తామని చెప్పారు.

Latest Updates