వంద కోట్లతో టాప్ లో ఉన్న అక్షయ్

akshay-kumar-is-the-highest-paid-actor-by-commercials

బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్  సంపాదనలో రికార్డ్ సృష్టించాడు. అమీర్ ఖాన్,షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి అగ్రహీరోలను వెనక్కి నెట్టేశాడు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను బాలీవుడ్ హీరోల యాడ్స్ ఆదాయ వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో రూ.100 కోట్లతో అక్షయ్ కుమార్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు.

అంతేగాకుండా బాలీవుడ్ క్రేజీ కపుల్స్ అయిన రణ్ వీర్ సింగ్,దీపికా పదుకొనేలను కూడా అధిగమించాడు అక్షయ్. ఆ తర్వాత రణ్ వీర్ సింగ్ రూ.84 కోట్ల ఆదాయంతో ఉన్నాడు.  ఆ తర్వాత దీపికా పదుకొనే రూ.74 కోట్లతో థర్డ్ ప్లేస్ లో ఉంది. అమితాబ్ బచ్చన్ రూ.72 కోట్లు,  అలియా భట్ రూ.68 కోట్లు, షారుఖ్ ఖాన్, రూ.48 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ.40 కోట్లు, కరీనా కపూర్ రూ.32 కోట్లు, కత్రినా కైఫ్ రూ.30 కోట్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Latest Updates