ధైర్యం, శౌర్యానికి ప్రతీక ‘కేసరి’: ఒళ్లు గగుర్పొడిచే ట్రైలర్

అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమా కేసరి. ఈ రోజు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. పరిణితి చోప్రా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు అనురాగ్ సింగ్ రూపొందించాడు. 1897లో బ్రిటీష్ పాలనలో… ఆఫ్ఘనిస్థానీ ఆక్రమణదారులు .. అప్పటి అఖండ భారత్ (నేటి పాకిస్థాన్) పంజాబ్ లోని సారాగడీ అనే ప్రాంతంపైకి దండెత్తి వస్తారు. 21 మంది సిక్కు యోధులు…  10 వేల మందిని శత్రువులను ఎలా ఎదుర్కొని.. తమ ప్రాంతాన్ని రక్షించుకున్నారన్న కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

ట్రైలర్ లోని సన్నివేశాలు.. డైలాగులు…  చూసే ప్రేక్షకుడి గుండె వేగం పెంచేలా ఉన్నాయి. ట్రైలర్ లో చూపించిన టేకింగ్, రీరికార్డింగ్, టెక్నిక్ సూపర్బ్. సిక్కు రెజిమెంట్ లీడర్ హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో… కాషాయ రంగు పగిడీతో యోధుడిగా అక్షయ్ కుమార్ నటించాడు. తన 20మంది బృందంలో ఇషార్ సింగ్ ధైర్యం ఎలా నింపాడు.. వారిలో గెలవగలం అనే నమ్మకాన్ని ఎలా నూరిపోశాడు అన్నది ఆసక్తికరం.

ట్రైలర్ లో వినిపించిన డైలాగులు కూడా ఆకట్టుకుంటున్నాయి. “ఓ బ్రిటీష్ వాడు మనల్ని బానిస అన్నాడు. ఎప్పటికీ బానిసలుగానే బతకాలి అన్నాడు. దానికి బదులిచ్చే టైమ్ వచ్చింది”, “కేసరి అంటే.. ఓ అమరుడు చూపించే ధైర్యం. అలాంటి కాషాయాన్నే నేనివాళ తలపాగాలా చుట్టుకున్నా. ఆ ధైర్యం, శౌర్యమే నా రక్తంలోనూ ప్రవహిస్తోంది. వచ్చే శత్రువులకు నేనిచ్చే బదులు కూడా ఇదే” అంటూ అక్షయ్ కుమార్ … ఎర్రగా మండుతున్న కత్తిని శత్రువు కడుపులో దూస్తూ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. తలపాగాపై ఉన్న గుండ్రని పదునైన ఆయుధం మరో హైలైట్. ట్రైలర్ .. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

హోలీ సందర్భంగా మార్చి 21న కేసరి సినిమాను విడుదల చేస్తున్నారు. జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్, అజూర్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు ఈ మూవీని భారీస్థాయిలో నిర్మించాయి.

Latest Updates