ఉగ్రవాదులను వదలొద్దు… అందర్ గుస్ కే మారో

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాదులను భాతర వాయుసేన మట్టుబెట్టడంతో దేశం అంతా హర్షం వ్యక్తం చేసింది. ఇందుకు.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ట్వీట్ చేశారు. “పుల్వామా దాడి చేసిన జైషే గ్రూప్ ను నామ రూపాల్లేకుండా చేయండి. “అందర్ గుస్ కే మారో” అని అక్షయ్ ట్వీట్ చేశారు.

పుల్వామా దాడి జరిగి 12రోజులు గడుస్తుండగా.. ఉగ్రమూకల క్యాంప్ లను ఏరివేసింది భారత్. దీంతో అమరులైన జవాన్లకు నివాళి ఇచ్చినట్టు అయిందని అంటున్నారు నెటిజన్లు. ఈ దాడిపై విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మట్లాడారు. జైషే ఉగ్రవాదులు మరో ఆత్మాహుతి దాడి జరుపుతారన్న ఇంటలిజెన్స్ సమాచారం ఉండటం వల్ల దాడిచేశామని తెలిపారు. కొండ ప్రాంతం లో ఉగ్రవాదులు ట్రైనింగ్ తీసుకుంటున్నారని చెప్పారు.  ఈ దాడిలో 300 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు సమాచారం.

Latest Updates