నాకు కెనడా పాస్‌పోర్టు ఉన్న విషయాన్ని దాచిపెట్టలేదు

బాలీవుడ్ హీరో అక్షయ కుమార్ లోక్ సభ ఎన్నికల్లో ఓటేయకపోవడం ఇటీవల వివాదాస్పదమైంది. ప్రధాని మోడీని ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ ఓటేయకపోవడం ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు నెటిజన్లు. ఈ విషయపై స్పందించారు అక్షయ్ కుమార్.. “తన పౌరసత్వంపై అనవసరమైన ఆసక్తి ఎందుకో అర్థం కావడం లేదన్న అక్షయ్.. తనకు కెనడా పాస్‌పోర్టు ఉన్న విషయాన్ని ఎప్పుడూ దాచిపెట్టలేదన్నారు.  ఏడేళ్లలో ఎప్పుడూ కెనడా వెళ్లలేదన్న ఆయన.. భారత్‌లోనే పని చేస్తున్నానని.. ఇక్కడే ట్యాక్స్‌లు కడుతున్నానని తెలిపారు.

‘ఇన్నేళ్లలో భారత్‌పై నాకున్న ప్రేమను ఎవరి దగ్గరా నిరూపించుకోవాల్సిన అవసరం రాలేదు. నా పౌరసత్వం విషయంలో తరచూ అనవసర వివాదంలోకి లాగడం బాధించింది. ఇది నా వ్యక్తిగతమైన, చట్టపరమైన వ్యవహారం. దానికి రాజకీయాలతో సంబంధం లేదు. దాంతో వేరేవాళ్లకు వచ్చిన నష్టం కూడా లేదు. ఎప్పటిలాగే దేశాన్ని మరింత బలోపేతం చేయడం కోసం నా వంతు కృషి, సాయం చేస్తాను” అని ట్వీట్ చేశారు అక్షయ్.

Latest Updates