సూటు.. బూటు.. బీడీ తో అల్లు అర్జున్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా అల వైకుంఠపురంలో. వినాయక చవితి కానుకగా ఆదివారం ఈ మూవీ ఫస్ట్ పోస్టర్  ను రిలీజ్ చేసింది యూనిట్. పోస్టర్ లో సూటు..బూటు వేసుకుని ఓ స్టూల్ పై కూర్చున్న బన్నీకి.. బీడీ ముట్టిస్తున్నాడు సెక్యురిటీ గార్డు. క్లాస్ లుక్కుతో..మాస్ స్టైల్లో ఉన్న ఈ పోస్టర్ ను బన్నీ ట్విట్టర్ పోస్ట్ చేశాడు. ఫస్ట్ పోస్టర్ ఆఫ్ ఏవీపీఎల్ అనే క్యాప్షన్ పెట్టి..ఫ్యాన్స్ షేర్ చేసుకున్నాడు. ఈ మూవీలో బన్నీ సరసన పూజా హేగ్దే హీరోయిన్ నటిస్తుంది.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది.

ఇప్పటికే త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు రాగా..ఇప్పుడు అల వైకుంఠపురంలో మూవీ రావడంత ఫ్యాన్స్ లో అంచనాలు బాగానే ఉన్నాయి.

Latest Updates