ఓ మైగాడ్ డాడీ.. కొడుకు కూతురు స్పెషల్ అట్రాక్షన్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న  అల వైకుంఠపురములో.. మూవీ రిలీజ్ కాకముందే  సాంగ్స్ మాత్రం రికార్డులు సృష్టిస్తున్నాయి. థమన్ మ్యూజిక్ అందించిన సామజవరగమన, రాములో రాములా.. సాంగ్స్  ఇప్పటికీ దుమ్ములేపుతున్నాయి. లేటెస్ట్ గా చిల్డ్రన్స్ డే సందర్భంగా  ఓమైగాడ్ డాడీ అనే సాంగ్ టీజర్ ను  రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ ట్యూన్ ఇంగ్లీష్ లో ఉన్నా చాలా క్యాచీగా ఉంది. కృష్ణ చైతన్య లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను రోల్ రిడా,రాహుల్ సిప్లిగంజ్, బ్లెజీ, రాహుల్ నంబియార్,రాబిట్ మ్యాక్ పాడారు.

ఈ టీజర్ లో అల్లు అర్జున్ కొడుకు అయాన్, కూతురు అర్హలు స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు. టీజర్ లో అల్లు అర్జున్ పోస్టర్ ముందు అయాన్, అర్హ ఇద్దరూ ఓ మైగాడ్ డాడీ జస్ట్ డోంట్ బీ మై డాడీ అంటూ నెత్తికి చేతులు బాదుతూ వాళ్ల డాడీని ఇమిటేట్ చేస్తుండడం  వైరల్ గా మారింది. టీజర్ లో అల్లు అయాన్ అల్లు అర్జున్ వేసిన ఓ చిన్న స్టెప్ కూడా వేశాడు.

Latest Updates