మందేసి చిందేసిన కానిస్టేబుల్ : సస్పెండ్ చేసిన సీపీ

హైదరాబాద్: డ్యూటీలో మందేసి రెచ్చిపోయిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్. ఫలక్ నుమాకు చెందిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య సోమవారం అర్ధరాత్రి మద్యం సేవించి రోడ్లపై వీరంగం సృష్టించాడు. పోలీస్ యూనిఫామ్ లోనే కానిస్టేబుల్ మద్యం సేవించి, అడ్డువచ్చిన వాహనదారులకు ఇబ్బందులు కలిగించాడు.

విషయం తెలుసుకున్న హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ ఈశ్వరయ్య సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ సంఘటనను గుర్తించనందుకు ఫలక్ నుమా సిఐకి చార్జి మెమో ఇచ్చారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే విధులు మరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు సీపీ.

Latest Updates