పోలీసు స్టేషన్ లోనే మద్యం తాగిన కానిస్టేబుళ్లు

అనంతపురం: డ‌్యూటీలో ఉన్న పోలీసులు ఏకంగా పోలీసు స్టేష‌న్ లోనే మందు సెట్టింగ్ వేశారు. ఇద్ద‌రు కానిస్టేబుళ్లు పెగ్గు మీద పెగ్గు వేస్తూ సీసీ కెమెరాకు అడ్డంగా బుక్క‌య్యారు. ఇది హిందూపురంలో పోలీసు కానిస్టేబుళ్ల నిర్వాకం. ఇటీవల కర్నాటక మద్యం బాటిళ్లను సీజ్ చేశారు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు. సీజ్ చేసిన‌ ఆ లిక్కర్ ను పోలీసు స్టేషన్ విచారణ గదిలో ఉంచారు. అయితే రాత్రి స‌మ‌యంలో పోలీసు స్టేషన్ లోనే కానిస్టేబుళ్లు తిరుమలేష్, నూర్ మహ్మద్ మ‌ద్యం బాటిళ్ల‌ను తీసుకుని ద‌ర్జారా డ్యూటీ కుర్చీలోనే కుర్చుని మ‌ద్యం తాగారు.

చివ‌ర‌కు సీసీ కెమెరాలో అడ్డంగా బుక్కయ్యారు హిందూపురం పోలీసులు. అయితే ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. లిక్క‌ర్ సేవించిన‌ ముగ్గురు సిబ్బందిపై వేటు వేశారు. కానిస్టేబుల్, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. హిందూపురం టూటౌన్ హెడ్ కానిస్టేబుళ్లు తిరుమలేష్ , నూర్ మహమ్మద్, కానిస్టేబుల్ గోపాల్ నాయక్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు.

Latest Updates