అలర్ట్ : నవంబర్‌లో బ్యాంకులకు 8 రోజులు సెలవులు

వచ్చేనెల(నవంబర్) లో బ్యాంకులకు 8 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. ప్రభుత్వ సెలవులతో పాటు పండుగల సందర్భంగా బ్యాంకులకు ఎనిమిది రోజుల పాటు సెలవులు ప్రకటించారు బ్యాంకు అధికారులు. నవంబరు నెలలో ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు వచ్చాయి. దీనితో పాటు దీపావళి, గురునానక్‌ జయంతి సెలవులు కూడా రావడంతో నవవంబర్ నెలలో బ్యాంకులు 8 రోజులు వర్క్  చేయవు.

ఖాతాదారులు సెలవు రోజుల్లో ఆన్‌లైన్‌ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలను వినియోగించుకోవాలని బ్యాంకు అధికారులు తెలిపారు.

బ్యాంకు సెలవులు…

..నవంబర్ 1- ఆదివారం
..నవంబర్ 8- ఆదివారం
..నవంబర్ 14- రెండో శనివారం, దీపావళి
..నవంబర్ 15- ఆదివారం
..నవంబర్ 22- ఆదివారం
..నవంబర్ 28- నాలుగో శనివారం
..నవంబర్ 29- ఆదివారం
..నవంబర్ 30- గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి

Latest Updates