అలర్ట్ : హైదరాబాద్ లో రేపటి నుంచి తాగునీటి సరఫరా బంద్

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రేపు(బుధవారం) తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. బుధవారం ఉదయం 6 గంటలనుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేయనున్నారు అధికారులు. నగర ప్రజలు నీటిని పొదుపుగా వాడుకుని…సహకరించాల్సిందిగా కోరారు.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

షేక్‌పేట్ , టోలిచౌకి, ప్రశాసాన్ నగర్, జూబ్లీ హిల్స్ , తట్టిఖాన, మాదాపూర్, గచ్చిబౌలి, గోల్డెన్ హైట్స్, హైదర్‌గూడ, అత్తాపూర్ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

 

 

Latest Updates