అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న ఆలేరు ఎమ్మెల్యే సునీత

అసెంబ్లీలో  ప్రశ్నోత్తరాల  సందర్భంగా  కన్నీరు పెట్టుకున్నారు  ఆలేరు ఎమ్మెల్యే  గొంగిడి సునీత. డయాలసిస్ పై   క్వశ్చన్ అడిగిన  ఎమ్మెల్యే… తన తండ్రి  కూడా  కిడ్నీ సంబంధిత  వ్యాధితోనే  చనిపోయాడని గుర్తు చేసుకున్నారు.

తన నియోజకవర్గం లోని కొలనుపాక లో ఓ 24  ఏండ్ల యవకుడు ఒక రోజు రాత్రి 11 గంటలకు ఫోన్ చేశాడని తెలపుతూ..” అక్కా… నాకు కిడ్నీ సంభవించిందిన సమస్య ఉంది..నేను వారంలో 2 రోజులు హైదరాబాద్ వెళ్లి డయాలసిస్ చేసుకుంటున్న…నాకు నాన్న లేదు అమ్మ ఒక్కతే ఉంది… నా ఖర్చులు అమ్మ భరించలేకపోతుంది అక్కా… అని చెప్పాడన్నారు.

తన తండ్రి కూడా..14 ఏళ్లుగా డయాలిసిస్ పేషెంట్‌గా ఉన్నారని,  దీంతో తాము ఆర్థికంగా చితికిపోయామని… తాము ఎంతో బాధ పడ్డామని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలి కాబట్టి.. ఆసరా పెన్షన్లు, ఎయిడ్స్ పేషెంట్స్ ఇచ్చినట్లుగానే కిడ్నీ పేషెంట్లకు పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని కోరుతున్నానంటూ.. సభలో కన్నీరు పెట్టుకున్నారు సునీత.

దీనిపై  సమాధానం ఇచ్చిన  మంత్రి ఈటల… మరిన్ని  డయాలసిస్  సెంటర్స్  ఏర్పాటు చేస్తామన్నారు.  పెన్షన్ ఇచ్చే అంశాన్ని  కూడా  పరిశీలిస్తున్నట్లు  చెప్పారు.

Latest Updates