ముళ్లులాంటి కామెంట్స్​కి పూలతో ఆన్సర్

ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉంటారు కొంతమంది. ఎన్ని అవకాశాలు అందుకుంటున్నా తమ నోటి దురుసు తనంతో అందర్నీ దూరం చేసుకుంటారు ఇంకొంతమంది. చిన్న వయసునుంచి ఎంతోకష్టపడి, ఎన్నో అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోయిన్ అయ్యింది కంగనా రనౌత్. జాతీయ పురస్కారాలు సైతం అందుకుంది. ఇప్పుడామెను ‘పద్మశ్రీ’ వరించింది. అది ఎంత పెద్ద వార్తో..అంతకుమించిన వార్త ఒకటి బాలీవుడ్ చక్కర్లు కొడుతోంది. పద్మశ్రీ వచ్చినందుకు కంగనాకి కంగ్రాట్స్‌ చెప్పింది అలియా. అందులో వింతేముంది, అందరూ చెబుతారుగా అనుకోకండి. పెద్ద స్టోరీ యే ఉంది. ఒకసారి సంబంధం లేని విషయంలోకి ఆలియాను లాగి రచ్చరచ్చ చేశారు కంగనా, ఆమె అక్క రంగోలి. అంతగా ప్రతిభ లేకున్నా తండ్రి అండతో ఇండస్ట్రీకి వచ్చిందని, ‘గల్లీ బోయ్స్’ సినిమాలో ఆమె నటన చాలా సాదాసీదాగా ఉందంటూ ఆలియాను తీవ్రంగా విమర్శించడమే కాదు, ఆ గొడవను ఆమె కుటుంబ సభ్యుల వరకూ తీసుకెళ్లారు.

అప్పుడు కూడా ఆలియా హుందాగానే స్పందించింది తప్ప గొడవ పడలేదు. పైగా ఇప్పుడు కంగ్రాట్స్ తెలుపుతూ కంగనాకు పుష్పగుచ్ఛాన్ని పంపించింది. దానితో పాటు ఒక గ్రీటింగ్ కార్డు కూడా పంపుతూ; దానిపై ‘విత్ లవ్ అలియా’ అని రాసింది. దానికి కూడా వింతగా రియాక్టయ్యింది రంగోలి.అలియా శుభాకాంక్షలు తెలియజేయడం కంగనాకు ఎలా ఉంటుందో కాని నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేసింది. అది చూసి అవాక్కయ్యారు నెటిజన్లు. కంగనాకి అభినందనలు తెలపడం ఆలియా సంస్కారమని, వాళ్లుచేసిన ముళ్లులాంటి కామెంట్స్​కి ఇలా పూలతో సమాధానం చెప్పడం నిజంగా గొప్ప విషయమని అభినందనలు తెలుపుతున్నారు. అదీ అలియా అంటే అంటున్నారు.

see more news

ఓటేయలేదని చితకబాదిన టీఆర్ఎస్ నేతలు

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సౌతాఫ్రికా ఆల్ రౌండర్

Latest Updates