ఆర్ఆర్ఆర్ షూట్‌‌లో జాయిన్ కానున్న ఆలియా భట్

హైదరాబాద్: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ యాక్ట్ చేయనుంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర నిర్మాణ పనులు ఈ మధ్యే మొదలయ్యాయి. రీసెంట్‌‌గా ఈ సినిమాలో తారక్ పాత్రకు సంబంధించిన టీజర్ లుక్‌‌ను రామరాజు ఫర్ భీమ్ పేరుతో సినీ యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నుంచి మరో అప్‌‌డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్‌‌లో ఆలియా భట్ జాయిన్ అవ్వనుందని సమాచారం. వచ్చే నెల 2వ తేదీ నుంచి ఆర్ఆర్ఆర్ షూట్‌‌లో ఆలియా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌‌లో జరిగే ఈ షూటింగ్ కోసం ఆలియా ఈ వీకెండ్‌‌లో నగరానికి చేరుకోనుంది. రామోజీ ఫిలిం సిటీలో చరణ్, తారక్, ఆలియా‌కు సంబంధించిన మేజర్ షూటింగ్ పార్ట్‌‌ను పూర్తి చేసేందుకు టీమ్ యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. మూవీ క్లైమాక్స్ సీక్వెన్స్‌‌ను రిచ్‌గా తీసేందుకు ఆర్ఎఫ్‌సీలో జక్కన్న భారీ సెట్‌‌ను సిద్ధం చేయించినట్లు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వచ్చే ఏడాది ఫస్టాఫ్‌‌లో ఆర్ఆర్ఆర్‌‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని జక్కన్న ప్లాన్స్ వేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విజువల్ వండర్‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఎన్ని రికార్డులు బద్దలవుతాయో వేచి చూడాలి.

Latest Updates