అలీబాబా వంద కోట్ల డాలర్ల ఫండ్

  • ఇండియా, దక్షిణాసియాల కోసం 

హాంకాంగ్ : చైనీస్ టెక్నాలజీ కంపెనీ అలీబాబా గ్రూప్ హోల్డింగ్‌‌కు చెందిన యాంట్ ఫైనాన్సియల్ ఇండియా, దక్షిణాసియా దేశాల కోసం 100 కోట్ల డాలర్ల యునికార్న్‌‌ ఫండ్‌‌ను అందించాలని చూస్తోంది. ఎమర్జింగ్ మార్కెట్లలో ఇన్వెస్ట్‌‌మెంట్లను పెంచడం కోసం ఈ మొత్తాన్ని సేకరించనున్నట్టు కంపెనీకి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ చెప్పారు. 100 కోట్ల డాలర్ల ఈ ఫండ్, యాంట్ ఫైనాన్సియల్ స్ట్రాటజిక్ బిజినెస్‌‌లపై ఫోకస్ చేయనుంది. అంటే ఆన్‌‌లైన్ పేమెంట్లకు సంబంధించిన టెక్నాలజీస్, ప్రత్యేక అవసరాల కోసం ఉపయోగించనుంది. ఈ విషయాన్ని 4వ గ్లోబల్ ఎంటర్‌‌‌‌ప్రిన్యూర్స్ సమిట్‌‌లో యాంట్ ఫైనాన్సియల్ వైస్ ప్రెసిడెంట్ జి గాంగ్ చెప్పారు. అలాగే బ్లాక్ చెయిన్, ఏఐ, సెక్యురిటీ, ఐఓటీ, కంప్యూటింగ్ వంటి టెక్నాలజీలపై కూడా పనిచేయనున్నట్టు తెలిపారు. ఈ టెక్నాలజీలు చిన్న, మధ్య స్థాయి ఫైనాన్సియల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ అభివృద్ధి చెందడానికి సాయం చేస్తాయని పేర్కొన్నారు.  ఎమర్జింగ్ మార్కెట్లలో డిజిటల్ ఫైనాన్సియల్ సర్వీసుల్లో అవకాశాల కోసం ఈ చైనీస్ ఫిన్‌‌టెక్ కంపెనీ చూస్తోంది. ఇండియాలో ఇన్వెస్ట్‌‌మెంట్లతో యాంట్ ఫైనాన్సియల్ విదేశీ జర్నీని ప్రారంభించింది. నాలుగేళ్ల క్రితమే ఈ కంపెనీ పేటీఎంలో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం పేటీఎం వాల్యుయేషన్ 16 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది యునికార్న్‌‌లకు కూడా యాంట్ ఫైనాన్సియల్ ఇన్వెస్టర్‌‌‌‌గా ఉంది. 160కి పైగా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.

Latest Updates