అలీబాబా సింగిల్స్‌‌డే సేల్స్‌‌ నేటి నుంచే

హంగ్‌‌ఝౌ (చైనా): గత ఏడాదిలాగే ఈసారీ సింగిల్స్‌‌ డే సేల్స్‌‌లో రికార్డులు సృష్టించాలని ఆన్‌‌లైన్‌‌ దిగ్గజం అలీబాబా టార్గెట్‌‌గా పెట్టుకుంది. నవంబర్‌‌ 11 న ప్రారంభం కావడంతో 11–11 లో నాలుగు ఒకట్లు ఉండటంతో దీనిని సింగిల్స్‌‌ డే సేల్స్‌‌గా వ్యవహరిస్తున్నారు. 2009 లో మొదటిసారి ఈ సింగిల్స్‌‌ డే సేల్స్‌‌కు అలీబాబా శ్రీకారం చుట్టింది. ఆ ఏడాది 7.8 మిలియన్‌‌ డాలర్ల జీఎంవీ (గ్రాస్‌‌ మెర్చండైజ్‌‌ వ్యాల్యూ) రికార్డు చేసింది. 2018 నాటికి ఈ జీఎంవీ ఏకంగా 30.8 బిలియన్‌‌ డాలర్లు దాటేయడం విశేషం. ఈ ఏడాది సింగిల్స్‌‌ డే సేల్స్‌‌లో 78 దేశాలకు చెందిన 22 వేల ఇంటర్నేషనల్‌‌ బ్రాండ్స్‌‌ భాగం పంచుకుంటున్నట్లు అలీబాబా ప్రకటించింది. ఈ ఏడాది చాలా కొత్త రికార్డులు ఉంటాయని భావిస్తున్నట్లు జనరల్‌‌ మేనేజర్‌‌ అల్విన్‌‌ లియు చెప్పారు. మొదటి రోజు ప్రిసేల్స్‌‌లో కిందటేడాది రికార్డును ఇప్పటికే అధిగమించినట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రిసేల్స్‌‌ 113 శాతం పెరిగాయన్నారు. చైనాలోని వినియోగదారులకు తమ బ్రాండ్స్‌‌ అమ్మేందుకు విదేశీ కంపెనీలకు ఇది సరైన అవకాశమని పేర్కొన్నారు. పాకిస్థాన్‌‌, బంగ్లాదేశ్‌‌, శ్రీలంక, మయన్మార్‌‌, నేపాల్‌‌లోనూ కిందటేడాది నుంచే సింగిల్స్‌‌ డే సేల్స్‌‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇండియాలో మాత్రం యూసీ షాపింగ్‌‌ ఫెస్టివల్‌‌ను పేటీఎం, వీమేట్‌‌, మరో 9 యాప్స్‌‌తో కలిసి అలీబాబా అందిస్తోంది.

Latest Updates