ఇండియా ఆన్​లైన్​లోకి అలీబాబా

అలీబాబా గ్రూప్‌‌ ఈ ఏడాది ఇండియాలో ఆన్​లైన్​ వ్యాపారాలను ప్రారంభించాలని చూస్తోంది. తన సబ్సిడరీ యూసీవెబ్ ద్వారా పూర్తి తరహాలో ఈ–కామర్స్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నట్టు కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. అలీబాబా గ్రూప్ ఇండియాలో ఈ–కామర్స్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టడం, పేటీఎంపై ఎలాంటి ప్రభావం చూపదని యూసీవెబ్ గ్లోబల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ హువైయువాన్ యాంగ్ అన్నారు. ఇండియాలో ఈ–కామర్స్​లో అపార అవకాశాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పేటీఎంలో అలీబాబా గ్రూప్‌‌కు 30.15 శాతం వాటాలున్నాయి. స్నాప్‌‌డీల్‌‌లో కూడా అలీబాబాకు 3 శాతం వాటా ఉంది. ఆన్‌‌లైన్ మూవీ టిక్కెట్లు అమ్మాలని కూడా యూసీవెబ్ చూస్తున్నట్టు యాంగ్ తెలిపారు. ఫ్లిప్​కార్ట్​లో అమెరికన్​ కంపెనీ వాల్​మార్ట్​ 70 శాతం వాటాలు కొనుగోలు చేసింది. మరో ఈ–కామర్స్​ కంపెనీ ఫ్యూచర్​ గ్రూప్​ సహా పలు ఆఫ్​లైన్​ రిటైల్​ కంపెనీల్లో వాటాలు తీసుకుంది.ఈ నేపథ్యంలో అలీబాబా ఈ నిర్ణయం తీసుకుంది.

Latest Updates