ఏలియన్స్ ఉన్నరు.. మనమే కనుక్కోలేకపోతున్నం

  •  థియరీలు పక్కనెట్టాలె.. అబ్జర్వేషన్ తీరు మారాలె
  • సైంటిస్టులు ఓపెన్ మైండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అబ్జర్వ్ చేయాలె 
  • డర్హమ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కొత్త వాదన

ఇంత పెద్ద విశాల విశ్వంలో మనం ఒంటరోళ్లమేనా? అసలు ఏలియన్స్ ఉన్నారా? లేరా? అంటే.. చాలామంది మాత్రం.. ఏలియన్స్ ఉన్నారని నమ్మకంగా చెప్తారు. ఎక్కడో ఓ చోట మనలాంటి భూమి ఉంటుందని, అచ్చంగా మనలా కాకపోయినా.. రకరకాల కథల్లో చెప్పుకున్నట్లు వింత వింత మనుషులైనా ఉంటారని, పైగా ఏలియన్స్ మనకంటే ఎంతో తెలివైన వాళ్లు అయి ఉంటారనీ అంటుంటారు. సైంటిస్టులు కూడా కచ్చితంగా భూమి లాంటి ప్లానెట్స్ ఉంటాయని, వాటిపై మన కంటే టెక్నాలజీలో ఎంతో ముందంజలో ఉన్న ఏలియన్స్ ఉండొచ్చని భావిస్తారు. అందుకే.. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సైంటిస్టులు రోజూ ఆకాశానికి టెలిస్కోపులు ఎక్కుపెట్టి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. కానీ.. ఇలా ఏలియన్స్ ను వెతికితే పెద్దగా లాభం లేదంటున్నారు బ్రిటన్ లోని డర్హమ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ పీటర్ వికర్స్. ఫిలాసఫీ ఆఫ్​సైన్స్ ప్రొఫెసర్ అయిన ఆయన.. ఏలియన్స్ ను వెతుకుతున్న విధానం మారాలంటూ ‘ది కన్వర్సేషన్’ వెబ్ సైట్ లో ఓ ఆర్టికల్ రాశారు.

అనూహ్యమైనవి ఊహించాలె

‘‘ఏలియన్స్ ఎలా ఉంటారు? మనం సినిమాల్లో చూసినట్టు, పుస్తకాల్లో రాసుకున్నట్టు అలాంటి వింత రూపాల్లోనే ఉంటారా? కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే అవన్నీ ఊహాగానాలే. అందుకే ఏలియన్స్ మనం ఊహించిన రూపాల కంటే భిన్నంగా ఉంటే మనం వాటిని కనీసం గుర్తించలేకపోవచ్చు కూడా” అని పీటర్ అంటున్నారు. అందుకే ఇప్పటికే మన బుర్రలో ఉన్న నమ్మకాలను చెరిపేస్తే తప్ప.. ఏలియన్స్‌‌‌‌కు సంబంధించిన ఏ చిన్న క్లూ అయినా స్పష్టంగా కన్పిస్తుందని చెప్తున్నారు. అసలు ఇప్పటివరకూ ఉన్న ఊహలకు డిఫరెంట్ గా కొత్తగా ఊహించాలని, అంటే అనూహ్యమైనవాటిని ఊహిస్తేనే ఏలియన్స్ జాడ కనిపెట్టగలమని పేర్కొంటున్నారు.

థియరీలతో లాభంలే

పెన్సిలిన్ మందు నుంచి బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వంలో విస్తరించిన కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాగ్రౌండ్ రేడియేషన్ వరకూ ఎన్నో కీలక విషయాలను యాక్సిడెంటల్ గానే కనుగొన్నారని పీటర్ అంటున్నారు. అలాగే ఇప్పటికే ఒక థియరీ రాసి పెట్టుకుని లేదా ఒక నమ్మకాన్ని బలంగా ఏర్పర్చుకుని, వాటి ఆధారంగానే ఏలియన్స్ కోసం వెతికితే ప్రయోజనం ఉండకపోవచ్చని చెప్తున్నారు. ఉదాహరణకు మనలో చాలామంది ‘లాడ్ నెస్ ఆఫ్​అబ్జర్వేషన్’ కు గురవుతుంటారని, దీనివల్ల మన నమ్మకాలు, ఆలోచనల పరిధిని దాటి ఆలోచించలేమని అంటున్నారు. ఈ కారణం వల్ల కొన్నిసార్లు ఎదురుగా కన్పిస్తున్న వాటినీ మన మైండ్ ఓవర్ లుక్ చేస్తుందని, వాటిని మనం చూసినా చూడనట్లే అవుతుందని పేర్కొంటున్నారు. అంటార్కిటికాపై ఓజోన్ హోల్ ను మొదటిసారి గుర్తించినప్పుడు, సైంటిస్టులు పట్టించుకోలేదని పీటర్ గుర్తు చేశారు.

Latest Updates