హైదరాబాద్‌లోకి ఎలియార్ ఫుడ్ సర్వీసెస్

Aliyar Food Services in Hyderabad

న్యూఢిల్లీ : ఫుడ్ సర్వీసెస్ సంస్థ ఎలియార్ హైదరాబాద్‌ లోకి అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా తన వ్యాపారాలు విస్తరణలో భాగంగా హైదరాబాద్, ఢిల్లీలో ఆపరేషన్స్‌‌ను లాంచ్ చేసినట్టు ప్రకటించింది. రోజుకు 40 వేల మీల్స్ సిద్ధం చేసేలా ఢిల్లీలో 15 వేల చదరపు అడుగులతో సెంట్రలైజ్డ్ కిచెన్‌ ను ఏర్పాటు చేసింది.  హైదరాబాద్, ఢిల్లీలలో ఆపరేషన్స్‌‌ను లాంచ్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని ఎలియార్ ఇండియా సీఈవో, ఎండి సంజయ్ కుమార్ అన్నారు. కార్పొరేట్ ఉద్యోగులలో ఆరోగ్యకరమైన ఆహారంపై  అవగాహన పెరుగుతుండటంతో దేశంలో ఫుడ్ సర్వీసుల సెగ్మెంట్‌‌లో ఎలియార్ ఇండియా గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని చెప్పారు. కంపెనీకి ఇండియాలో 8 సెంట్రలైజ్డ్  కిచెన్లున్నాయి. కార్పొరేట్ క్లయిం ట్స్‌‌కు రోజుకు లక్షకుపైగా మీల్స్‌‌ను సర్వ్‌‌ చేస్తున్నామని కుమార్  పేర్కొన్నారు. కేటరింగ్, దానికి సంబంధించిన సర్వీసులలో ఎలియార్ గ్రూప్ అగ్రస్థానంలో ఉంది. 16 దేశాల్లో ప్రతి రోజూ 55 లక్షల మందికి కేటరింగ్ చేస్తోంది. లక్షా 27 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు

Latest Updates