పిల్లలు అందరూ కోలుకున్నారు: రాఘవ లారెన్స్‌

చెన్నై: తన ట్రస్ట్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిన పిల్లలు అందరూ కోలుకున్నారని యాక్టర్‌‌, కొరియోగ్రాఫర్‌‌ రాఘవ లారెన్స్‌ చెప్పారు. ‘నా ఫ్యాన్స్‌, స్నేహితులకు నమస్కారం. ఓ మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నా ట్రస్ట్‌లో ఉన్న పిల్లలంతా వ్యాధినుంచి కోలుకున్నారు. వాళ్లంతా ట్రస్ట్‌కు వచ్చేశారు. రాత్రి, పగలు అని తేడాలేకుండా కష్టపడుతున్న డాక్టర్లు, నర్సులకు థ్యాంక్స్‌. పిల్లల కోసం ప్రేయర్‌‌ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు” అని లారెన్స్‌ ట్వీట్‌ చేశారు. లారెన్స్‌ నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి కరోనా సోకడంతో వారిని హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్‌ అందించారు.

Latest Updates