కోచింగ్స్ అన్నీ.. ఆన్ లైన్ లోనే..

కాంపిటీటివ్, ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్

ఒక్కో సెషన్ 5 గంటలపైనే..

లైవ్ క్లాస్ లు.. వీక్లీ టెస్ట్​లు

ఆరు నెలల పాటు ట్రైనింగ్

కోర్సుని బట్టి రూ.5 వేల నుంచి ఫీజులు

హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో ఆన్ లైన్ కోచింగ్స్ కి డిమాండ్ పెరుగుతోంది. లాక్ డౌన్ తో అన్ని కోచింగ్ సెంటర్లు క్లోజ్ అయిపోవడంతో ఆన్ లైన్ అకాడమీలకు క్రేజ్ పెరిగింది. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు, హైయర్ స్టడీస్ కి ఎంట్రెన్స్ ఎగ్జా మ్ రాయాలనుకునే వారు వర్చువల్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. నిర్వాహకులు సర్టిఫైడ్ లెక్చరర్స్ తో ఆన్ లైన్ లైవ్ క్లాసులు కండెక్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా ప్రమోషన్ చేస్తున్నారు. అన్ని రంగాలకు సంబంధించి కోచింగ్స్ అందుబాటులో ఉంటుండటంతో మెంబర్స్ నెట్ లో సెర్చ్​ చేసి అకాడమీల బయోడేటా చూస్తున్నారు.  డెమో క్లాస్ విని జాయిన్ అవుతున్నారు.

ఇనిస్టిట్యూషన్స్ క్లో జ్ అవడంతో..

సిటీలో వందల కోచింగ్ సెంటర్లు ఉన్నా, కరోనా కారణంగా బంద్ అయ్యాయి. దాంతో లాక్ డౌన్ ముందు వరకు ఇనిస్టిట్యూట్లలో కోచింగ్ తీసుకున్నవాళ్లు ఇప్పుడు ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ ను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ తోపాటు గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన పలు అకాడమీలు వర్చువల్ కోచింగ్ అందిస్తున్నాయి. డిజిటల్ కోచింగ్ క్లాసులు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ పెరిగింది. అకాడమీలు తమ సమాచారం, టీచింగ్ స్టాఫ్, రేటింగ్, రివ్యూస్ ను ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా తెలుపుతున్నాయి. కాంపిటీటివ్, ఎంట్రెన్స్ ఎగ్జామ్ లకు సంబంధించిన డెమో క్లాసులను అందుబాటులో ఉంచుతున్నాయి. క్యాండిడేట్స్ డెమో విన్న తర్వాత జాయిన్ అవ్వాలనుకుంటే ఆన్ లైన్ లో పేమెంట్ చేయొచ్చు. అందుకోసం బ్యాంక్ డీటెయిల్స్, గూగుల్ పే వంటి పేమెంట్ మెథడ్స్ ఇస్తున్నారు. ఎగ్జామ్ డేట్ని బట్టి ట్రైనింగ్ పీరియడ్ ఉంటోంది.

యూట్యూబ్ లో లైవ్ సెషన్స్…

ఆన్ లైన్ కోచింగ్ అందించే అకాడమీలు క్యాండిడేట్స్ తో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా యి. డైలీ క్లాస్ టైమింగ్స్, యూ ట్యూబ్ లింక్ ను అందులో పోస్ట్ చేస్తున్నాయి. ఒక్కో అకాడమీకి వేలల్లో క్యాండిడేట్స్ ఉంటున్నారు. ‘‘నేను నర్సింగ్ లో మాస్టర్స్ కోసం రాజస్థా న్ కి చెందిన అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నా. ఫేస్ బుక్ లో చూసి డెమో విని జాయిన్ అయ్యా. ప్రజెంట్ ర్యాష్ కోర్స్ నడుస్తోంది. మల్టిపుల్ క్వశ్చన్స్ కి సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నారు. డైలీ 8 గంటలు ఆన్ లైన్ లైవ్ క్లాసులు జరుగుతున్నాయి’’ అని నర్సింగ్ స్టూడెంట్ రాధ తెలిపారు. మెడికల్, బ్యాంకింగ్, డిఫెన్స్, ఐఐటీ, రైల్వే, గ్రూప్స్ తదితర రంగాలకు సంబంధించి అకాడమీలు ఆన్ లైన్ కోచింగ్ ఇస్తున్నాయి. ఒక్కో ఇనిస్టిట్యూషన్ లో సబ్జెక్ట్ వైజ్ గా ఐదుగురి నుంచి ఆరుగురు లెక్చరర్స్ ఉంటున్నారు. వారితో డైలీ లైవ్ క్లాసులు ఇప్పిస్తున్నాయి. వీక్లీ టెస్ట్ లు, ఎక్స్ పర్ట్ ప్రిపేర్ చేసిన స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు.

నాతోపాటు 400మందికిపైగా…

ఎయిమ్స్ కి ప్రిపేర్ అవ్వాలని ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నా. వారం కింద క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. 6 నెలలకు 6,500 ఫీజు పే చేశాను. ఉదయం 5 గంటలు, సాయంత్రం 5 గంటలు యూట్యూబ్ లో లైవ్ క్లాస్ ఉంటుంది. మల్టీపుల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఆన్సర్ చేయాలి అనేది థియరీ వైజ్ గా కోచింగ్ ఇస్తున్నారు. త్వరలోనే ఎంట్రెన్స్ ఎగ్జా మ్ ఉంది. నేను తీసుకుంటున్న అకాడమీలో నాతోపాటు 400 మందికిపైగా కోచింగ్ తీసుకుంటున్నారు. ‑ దుర్గ, స్టూడెంట్

Latest Updates