ఏప్రిల్ 14 వరకు హైకోర్టుతో పాటు అన్ని కోర్టులు బంద్

తెలంగాణలో జిల్లా సహా అన్ని కోర్టులను ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్( మూసివేస్తున్నట్లు) విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఏప్రిల్ 14 లేదా తర్వాత వచ్చే ఉత్తర్వులు వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కేసుల్లో అవసరమయ్యే కొంత మంది మినహా మిగిలిన సిబ్బంది  కోర్టులకు హాజరు కానవసరం లేదని తెలిపింది.  అవసరమైనపుడుఫోన్ లో అందుబాటులో ఉండాలని ఆదేశించింది.  అత్యవసరమైనే సివిల్, రిమాండ్, బెయిల్ ,రిమాండ్ పొడిగింపు లను వీడియో కాన్ఫరెన్స్ , లేదా స్కైప్ ద్వారా  విచారించాలని ఆదేశించింది.

ఇందుకు గానూ  ప్రతీ సోమవారం,బుధవారం వీడియో కాన్ఫరెన్స్  ,స్కైప్ ద్వారా ఎమర్జెన్సీ కేసుల విచారణ చేపడతామని చెప్పింది. న్యాయవాదులు గానీ పిటిషనర్లు  తమ కారణాలను రిజిస్ట్రార్ మెయిల్ కు పంపాలని ..వాటిని ప్రధాన న్యాయమూర్తి అనుమతిస్తే  అపుడు సంబంధిత కోర్టు విచారణ చేపడుతుందని సూచించింది. అలాగే హైకోర్టుతో పాటు కింది కోర్టులు జారీ చేసిన అన్నిరకాల స్టేలను జూన్ 7 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Latest Updates