రెవెన్యూ ఫైళ్లన్నీ సీజ్

కొత్త రెవెన్యూ యాక్ట్ కు ముందు సర్కార్ యాక్షన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూములు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అన్ని పనులు ఒక్కసారిగా ఆగిపోయాయి. కొత్త రెవెన్యూ చట్టం తెస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, భూరికార్డుల సవరణలను సర్కారు నిలిపి వేసింది. వీఆర్వోల దగ్గర ఉన్న రెవెన్యూ రికార్డులన్నింటి నీ సీజ్ చేయాలని సోమవారం ఉదయం కలెక్టర్లను ఆదేశించిన సర్కారు.. పగటి కల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లను ఆపేసింది. ధరణి వెబ్ సైట్​ద్ వారా తహసీల్దార్లు భూముల మ్యుటేషన్ చేయకుండా లాగిన్ ను నిలిపివేసింది. కొత్త చట్టం తెస్తుం డటంతో భూముల రికార్డులు ట్యాంపర్ చేసే చాన్స్​ ఉందని ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. రెవెన్యూ రికార్డుల సీజ్, రిజిస్ట్రేషన్ల నిలిపి వేత నిర్ణయాలు ఆ రెండు శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపాయి. ఏం జరుగుతోందో అర్థం కాక ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేసి ఎంక్వైరీలు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ రికార్డులు సీజ్

రాష్ ట్రవ్యాప్తంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల (వీఆర్వో) వద్ద ఉన్న ఒరిజనల్ రికార్డులు, జిరాక్స్​కాపీలతో పాటు ప్రజల నుంచి వచ్చిన అప్లికేషన్లు, పంపిణీ చేయని పట్టాదారు పాస్ బుక్కులను స్వాధీనం చేసుకోవాలని సోమవారం ఉదయమే సీఎస్ సోమేశ్​కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మధ్యాహ్నం మూడు గంటలలోగా రికార్డుల సీజ్ కు సంబంధించి ఒక ఫార్మాట్లో రిపోర్ట్​ పంపాలని సూచిం చారు. కలెక్టర్లు వెంటనే తహసీల్దార్లను అప్రమత్తం చేసి వీఆర్వోల వద్ద ఉన్న రికార్డులను సీజ్ చేయించారు. ఇందులో సేత్వార్, ఖాస్రా, చేసాల్, వన్ బీ రికార్డ్, పహాణీలు, మ్యుటేషన్ (రిజిస్ట్రేషన్) / వారసత్వ రిజిస్టర్లు , నోటీసులు, పీఓటీ, సాదాబైనామా / అసైన్ మెంట్ ఫైళ్లు, నాలా సంబంధిత ఫైళ్లు, విలేజీ మ్యాప్స్, టిప్పన్స్, ఉపయోగించని రశీదు పుస్తకాలు (నీటి పన్ను /ఇతర రశీదులు), పంపిణీ చేయని పాస్ బుక్కులు, తప్పుగా ముద్రించిన పాస్ బుక్కులు ఉన్నాయి. అందజేసిన రికార్డులు, వాటి సంఖ్యతో కూడిన లిస్టుతో వీఆర్వోలకు రశీదు కూడా ఇచ్చారు. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఇంటి గ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్ మెంట్​సిస్టమ్ (ఐఎల్ఆర్ఎంఎస్) వెబ్ సైట్​లో రికార్డులను డిజిటలైజేషన్ చేసిన విషయం తెలిసిం దే. తహసీల్దార్, ఆర్డీవో, జేసీలు లాగి న్ అయి ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల ఆధారంగా.. ఈ రికార్డుల్లో చేర్పులు, మార్పులు చేయడానికి ఆప్షన్ ఉంది. కొత్త చట్టం నేపథ్యంలో ఈ ఆప్షన్ విని యోగించుకోకుండా లాక్​ చేశారు.

అప్పుట్లో పట్వారీ.. ఇప్పుడు వీఆర్వో వ్యవస్థ

గ్రామ స్థాయిలో భూ రికార్డుల నిర్వహణను నిజాం కాలంలో పట్వారీలు నిర్వహిస్తుం డేవారు. ఉమ్మడి ఏపీలోనూ ఇదే వ్యవస్థ కొనసాగింది. పెత్తందారీ తనానికి ప్రతిరూపంగా మారిన పటేల్, పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్‌ సీఎం అయ్యాక 1984లో రద్దు చేశారు. తర్వాత రెవెన్యూ రికార్డులను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. అవి 2001లో వీఆర్వోల చేతికి వచ్చాయి . భూరికార్డుల మార్పిడిలో వీఆర్వోలపై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో కేసీఆర్ కూడా ఎన్టీఆర్ బాటలో నడిచారు. వీఆర్వో వ్యవస్థ రద్దుకు నిర్ణయం తీసుకున్నారు.

ఒకే గొడుగు కిందికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు!

భూముల మ్యుటేషన్, రికార్డుల నిర్వహణలో ఇంచుమించు ఒకే రకమైన పని చేసే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రెవెన్యూ శాఖలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రెండు డిపార్ట్​మెంట్లను విలీనం చేసి మండల స్థాయి కి రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని విస్తరిం చాలని, తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ పవర్స్​ ఇవ్వాలని యోచిస్తు న్నట్టు సమాచారం. ఇందుకోసం రిజిస్ట్రేషన్స్​ సేల్ డీడ్ లు, ఆర్వోఆర్ పట్టాదార్ పాస్ పుస్తకాల డేటాతో ధరణి వెబ్ సైట్​ను అందుబాటులోకి తేనుంది. వివాదాల్లేని భూముల క్రయవిక్రయాలు జరిగినప్పుడు ఒకేరోజులో మ్యుటేషన్ పూర్తయి, డాక్యుమెంట్లు జారీ అయ్యేలా చేయనున్నారు.

వీఆర్వో, తహసీల్దా ర్ఆఫీసులకు రైతుల క్యూ

వీఆర్వోల నుం చి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకుం టున్నారనే వార్తలు వెలువడగానే.. పట్టా దారు పాసుబుక్కుల్లో తప్పులు దొర్లినవారు, కొత్త పాస్ బుక్ ల కోసం అప్లికేషన్ పెట్టుకున్న రైతులు ఆందోళన పడ్డారు . తహసీల్దా ర్, వీఆర్వో ఆఫీసులకు క్యూ కట్టారు . తమ పని ఎక్కడిదాకా వచ్చిందని ఆరా తీశారు. పెండిం గ్ అప్లికేషన్లు, ఇతర పనులపై జనం తాకిడి పెరిగే అవకాశముందని.. రికార్డుల సీజ్ నేపథ్యం లో కొత్త రెవెన్యూ చట్టం పై స్పష్టత వచ్చేవరకు రెవెన్యూ ఆఫీసులకు కూడా సెలవు ప్రకటించాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్​ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

రిజిస్ట్రేషన్లు బంద్

కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యా ప్తం గా ప్రభుత్వం అన్ని సబ్ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆఫీసు సిబ్బంది, అధికారులకు నిరవధిక సెలవులు ప్రకటించింది. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి సోమవారం ఒక్కరోజు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు చాన్స్​ ఇచ్చింది. ఇది తెలియడంతో చలానాలు కట్టినవారంతా రిజిస్ట్రేష న్లకు క్యూకట్టారు. దీంతో రిజిస్ట్రేష న్ల వెబ్ సైట్​కు తాకిడి పెరిగి సర్వర్​ డౌన్ అయి ఇబ్బంది కలిగింది. చాలాచోట్ల రిజిస్ట్రేషన్లు సోమవారం సాయంత్రానికే నిలిచిపోయాయి. రాత్రి ఏడు గంటల వరకు 3,365 డాక్యుమెంట్లు రిజిస్టర్​ కాగా.. రూ.14.17 కోట్ల ఇన్ కమ్ వచ్చింది.

అగ్రికల్చర్​, పీఆర్, మున్సిపల్​ శాఖల్లో విలీనం

ప్రస్తు తం రాష్ట్ర వ్యాప్తంగా 7,172 వీఆర్వో పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 5,088 మంది పనిచేస్తున్నా రు. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి . ఉన్న వీఆర్వోలను రెవెన్యూ శాఖ నుంచి తప్పిం చి.. వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల్లో విలీ నం చేయాలని సర్కారు భావిస్తు న్నట్టు తెలిసింది. డిపార్ట్​మెంట్​ను ఎంచుకునే ఆప్షన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వారి డెజిగ్నేషన్లు కూడా మారనున్నాయి . ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23 వేల మంది వీఆర్ఏలను ఏ శాఖ పరిధి లో కొనసాగి స్తారన్నది తేలాల్సి ఉంది.

రేపు సభ ముందుకు కొత్త రెవెన్యూ బిల్లు

రెండేళ్లుగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన కొత్త రెవెన్యూ బిల్లుకు రాష్ట్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. తెలంగాణ ల్యాండ్ రైట్​ అండ్​ పట్టాదార్​ పాస్ బుక్ బిల్లు –2020ని బుధవారం సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ దఫా సమావేశాల్లో రెవెన్యూ బిల్లుపైనే సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

Latest Updates