ఎక్కడికక్కడే నిలిచిపోయిన లారీలు

విశాఖ: ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ బంద్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఎక్కడ లారీలు అక్కడే నిలిచిపోయాయి. విశాఖలో కూడా 20 వేల లారీలు వివిధ పరిశ్రమల వద్దే నిలిచిపోయాయి. వాటికి తోడు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్న  సుమారు 25 వేల లారీలు, ట్యాంకర్లు కూడా విశాఖలోనే  ఆగిపోయాయి. లారీలు, ట్రాలర్లు, టిప్పర్లు అందులో పనిచేసే డ్రైవర్లు, హెల్పర్లు బంద్‌లో పాల్గొన్నారు. లారీ ఆపరేటర్ల బంద్‌కు విశాఖలోని ఆటో, వివిధ ట్రేడ్ యూనియన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

ట్రాన్స్ పోర్ట్ రంగంపై కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న భారీ జరిమానాలకు నిరసనగా ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ ఈ దేశవ్యాప్త లారీల బంద్‌కు పిలుపునిచ్చింది. సవరించిన భారత మోటారు వాహన చట్టం-2019 ప్రకారం కేంద్రప్రభుత్వం దూరప్రాంతాలకు తిరిగే లారీలపై పెనుభారం మోపింది. దీని ప్రకారం చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా పలు రాష్ట్రాల్లో వేల నుంచి లక్షల్లో జరిమానా విధిస్తున్నారు. సంక్షోభంలో ఉన్న లారీ పరిశ్రమకు ఈ కొత్త చట్టం పెను నష్టాన్ని తెచ్చి పెడుతోందని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

All India Motor Transport Congress (AIMTC) bundh effect in vizag

Latest Updates