దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌‌ను ఉచితంగా ఇవ్వాలి

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ సిద్ధమయ్యాక దేశ ప్రజలందరకీ ఒకేసారి అందుబాటులోకి తీసుకు రావాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్‌‌ హామీని చేర్చడంపై వివాదం నడుస్తోంది. వ్యాక్సిన్‌‌పై రాజకీయాలు చేయడం ఏంటని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్, నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా బీజేపీని తూర్పారపట్టారు. తాజాగా ఈ వివాదంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ‘మొత్తం దేశానికి కరోనా వ్యాక్సిన్‌‌ను ఉచితంగా అందించాలి. దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను ఫ్రీగా పొందే హక్కు ఉంది’ అని కేజ్రీవాల్ చెప్పారు.

Latest Updates