జీహెచ్ఎంసీ ప్రచారమంతా సోషల్ మీడియాలోనే.. ఏ పార్టీకి, ఏ లీడర్‌కు ఎంతమంది ఫాలోవర్లున్నారంటే..

సోషల్ మీడియానే నమ్ముకుంటున్న పార్టీలు

ఒకప్పుడు ఎలక్షన్లంటే సభలు, ర్యాలీలు, మీటింగ్‌లతో హడావుడి ఉండేది. కానీ ఇప్పుడు అవేవీ లేకుండానే ప్రచారం జోరుగా సాగిపోతోంది. లీడర్లు చెప్పేదంతా క్షణాల్లో లక్షలాది మందికి చేరిపోతోంది. సభలు, ర్యాలీలు, మీటింగ్‌లు లేకుండా ప్రచారం ఎలా అనుకుంటున్నారా? మీకు తెలియనిది ఏముంది. అంతా సోషల్ మీడియాలోనే. అవును ఇప్పుడు పార్టీలు, లీడర్లు అంతా సోషల్ మీడియానే నమ్ముకున్నారు. విషయమేదైనా సరే ఒక్క పోస్టుతో ప్రజలందరికీ చేరువవుతున్నారు. సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్లు ఉంటే అంత తొందరగా తమ పోస్టులు ప్రజలకు చేరతాయని అటు పార్టీలు, ఇటు లీడర్లు భావిస్తున్నారు. ట్వీట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వీటిని ఉపయోగిస్తూ లీడర్లు తమ వాయిస్‌ను ప్రజలకు చేరవేస్తున్నారు. అందుకే పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాలను మెయింటైన్ చేస్తున్నాయి.

పార్టీల పరంగా చూసుకుంటే.. టీఆర్ఎస్‌కు ఫేస్‌బుక్‌లో 11.19 లక్షలు, ట్విట్టర్‌లో 5.3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌కు ఫేస్‌బుక్‌లో 2.34 లక్షలు, ట్విట్టర్‌లో 76 వేల మంది ఫాలోవర్లు; బీజేపీకి ఫేస్‌బుక్‌లో 3.45 లక్షలు, ట్విట్టర్‌లో 1.07 లక్షల మంది ఫాలోవర్లు; ఎంఐఎంకు ఫేస్‌బుక్‌లో 8.49 లక్షలు, ట్విట్టర్‌లో 5.19 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

అదేవిధంగా లీడర్లకు కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మరియు మున్పిపల్ మంత్రి కేటీఆర్‌కు ఫేస్‌బుక్‌లో 10.48 లక్షల మంది, ట్విట్టర్‌లో 20.60 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అదేవిధంగా ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు ఫేస్‌బుక్‌లో 3.17 లక్షల మంది, ట్విట్టర్‌లో 9.95 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజయ్‌కు ఫేస్‌బుక్‌లో 1.64 లక్షల మంది, ట్విట్టర్‌లో 1.26 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ కిషన్ రెడ్డికి ఫేస్‌బుక్‌లో 4.55 లక్షల మంది, ట్విట్టర్‌లో 2.26 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫేస్‌బుక్‌లో 7.07 లక్షల మంది, ట్విట్టర్‌లో 93 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎంపీ రేవంత్ రెడ్డికి ఫేస్‌బుక్‌లో 6.03 లక్షల మంది, ట్విట్టర్‌లో 1.75 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

For More News..

అయిదు నెలల గర్భవతిని చంపి.. ఆమె తండ్రి పొలంలోనే పాతిపెట్టిన పార్టనర్

తెలంగాణలో కొత్తగా 921 కరోనా కేసులు

వంద మిలియన్ల ఫాలోవర్లను సాధించిన మొట్టమొదటి టిక్‌టాక్ స్టార్

Latest Updates