ఇంటర్ పోరు: 11న ధర్నాచౌక్ లో విద్యార్థి సంఘాల దీక్ష

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు,  స్టూడెంట్స్ ఆత్మహత్యలకు నిరసనగా అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి.  ఈ నెల  11 వ తేదీన ప్రతిపక్ష విద్యార్థి సంఘాలు నిరసన దీక్ష నిర్వహించాలని నిర్ణయించాయి. 

ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ దగ్గర.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుందని.. విద్యార్థి సంఘాల నాయకులు చెప్పారు. ఈ నిరసన దీక్షలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటిపార్టీ, జనసేన పార్టీల నాయకులు, అనుబంధ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొంటారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

Latest Updates