రేపు అన్నీ బంద్: తెలంగాణలో 24 గంటలు జనతా కర్ఫ్యూ

తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామన్నారు సీఎం కేసీఆర్. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ లో పాల్గొనాలన్నారు. ఆదివారం తెలంగాణలో ఎమర్జెన్సీ సేవలు తప్ప అన్నీ సేవలు బంద్ చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ, మెట్రో సేవలు బంద్ అని అన్నారు. అత్యవసరం కోసం డిపోకు ఐదు ఆర్టీసీ బస్సులు, ఐదు మెట్రో రైలు నడుస్తాయన్నారు. దుకాణాలు, వైన్స్ షాపులు బంద్ చేయాలని ఆదేశించారు.  మహారాష్ట్ర బార్డర్ ను మూసివేసే ఆలోచన చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కూడా ఆపేస్తామన్నారు. మాల్స్, షాపులు కూడా మూసేయాలన్నారు. ఆస్పత్రులు, పాలు,పండ్లు,కూరగాయలు, పెట్రోబంక్ లు, మీడియా సిబ్బందికి కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. 24 గంటలు కర్ఫ్యూ పాటించి యావత్ దేశానికి ఆదర్శంగా నిలుద్దామన్నారు.

Latest Updates