కరోనా ఎఫెక్ట్.. పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలన్న ప్రభుత్వాలు

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. బిహార్ గవర్నమెంట్ ఈనెల 31 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి డబ్బులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈనెల 22న బిహార్ దివస్ సందర్భంగా జరగాల్సిన కార్యక్రమాలన్నింటిని రద్దు చేసింది. మహారాష్ట్రలో కొత్తగా మరో రెండు కరోనా పాజివ్ కేసులు నమోదయ్యాయి. నాగ్ పూర్  సిటీలో 2 పాజిటివ్ కేసులు వచ్చాయని… దీంతో సిటీలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరింది. జమ్మూకశ్మీర్ లో మెడికల్ కాలేజీల సిబ్బందికి సెలవులు రద్దు చేసింది ప్రభుత్వం.

ఇరాన్ నుంచి మరో 44 మంది భారతీయులను ప్రభుత్వం శుక్రవారం తీసుకొచ్చింది. ఇరాన్ నుంచి వచ్చిన ఆ ప్రత్యేక విమానం ముంబయిలో ల్యాండ్ అయింది. అయితే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ చేయనున్నారు అధికారులు. ఆ తర్వాత కరోనా నెగెటివ్ వస్తేనే ఇళ్లకు పంపించనున్నారు.

ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కూడా ప్రికాషనరీ మెజర్స్ స్టార్ట్ చేసింది. అంగన్ వాడీలు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, వాటర్ పార్క్స్, పబ్లిక్ లైబ్రరీలను ఈనెల 31వరకు మూసేయాలని ఆదేశించింది ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం. పెళ్లిళ్లను కొన్ని రోజులపాటు వాయిదా వేయాలని కోరింది.

కర్ణాటకలో వారం పాటు సినిమా థియేటర్లు, మాల్స్, పబ్బులు వారం మూసేయాలని ఆదేశించింది. అలాగే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల లాంటివి కూడా పెట్టుకోవద్దని ప్రభుత్వం సూచించింది.

ఇక దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ ర్యాలీలను వాయిదా వేసింది ఆర్మీ. ఒక నెల పాటు రిక్రూట్మెంట్ ర్యాలీలను వాయిదా వేస్తున్నట్టు ఆర్మీ తెలిపింది. ఆర్మీ సిబ్బంది అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది.

all state governments alerted on corona effect

Latest Updates