దసరా వరకూ రాష్ట్రంలో అన్ని ప‌రీక్ష‌లు వాయిదా

ద‌స‌రా పండుగ వ‌రకూ రాష్ట్రంలో ఎలాంటి పరీక్ష‌లు జ‌ర‌ప‌బోమ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు. తెలంగాణ‌వ్యాప్తంగా ముఖ్యంగా హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాల కార‌ణంగా జ‌న‌జీవ‌నం అత‌లాకుత‌ల‌మైంది. న‌గ‌రం మాములు స్థితికి రావాలంటే చాలా రోజుల స‌మ‌య‌మే ప‌ట్టేలా ఉంది. మ‌రోవైపు వివిధ శాఖ‌ల అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మై ఉన్నారు. ఈ క్ర‌మంలో ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని ప్ర‌భుత్వం భావించింది. ద‌స‌రా వ‌ర‌కు షెడ్యూల్‌లో ఉన్న ప‌రీక్ష‌ల‌న్నీ కూడా వాయిదా వేస్తున్న‌ట్టు మంత్రి ప్ర‌క‌టించారు. తిరిగి ప‌రీక్ష‌లు ఎప్పుడు నిర్వ‌హించేది త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Latest Updates