ఒక్కరోజులోనే టికెట్లు ఖతం

ఇండియా-ఆస్ట్రేలియా లిమిటెడ్‌‌ ఓవర్ల సిరీస్‌‌ టికెట్లకు భారీ డిమాండ్‌‌

ఒక్క రోజులోనే అమ్ముడైన మూడు వన్డేలు, మూడు టీ20ల టికెట్లు

సిడ్నీ: తమ అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూడాలని కొన్ని నెలల నుంచి ఆశిస్తున్న  ఫ్యాన్స్‌‌ టీమిండియా–ఆస్ట్రేలియా మధ్య లిమిటెడ్‌‌ ఓవర్ల మ్యాచ్‌‌ల టికెట్ల కోసం ఎగబడ్డారు. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌‌లకు సంబంధించిన టికెట్‌‌ సేల్స్‌‌ను శుక్రవారం అందుబాటులోకి తీసుకురాగా.. ఒక్క రోజులోనే దాదాపు అన్నీ అమ్ముడయ్యాయని క్రికెట్‌‌ ఆస్ట్రేలియా తెలిపింది. మరో 2 వేల టికెట్స్‌‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. పోస్ట్‌‌ కరోనా తర్వాత ఫ్యాన్స్‌‌ సమక్షంలో జరిగే  తొలి ఇంటర్నేషనల్‌‌ సిరీస్‌‌ కావడంతో దీనికి భారీ డిమాండ్‌‌ నెలకొంది. ఆస్ట్రేలియా స్టేడియాల్లో జులై నుంచే పరిమిత సంఖ్యలో జనరల్‌‌ పబ్లిక్‌‌కు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా–ఆస్ట్రేలియా క్రికెట్‌‌ మ్యాచ్‌‌లకు స్టేడియం కెపాసిటీలో సగం వరకూ ఫ్యాన్స్‌‌కు అనుమతిచ్చేందుకు లోకల్‌‌ గవర్నమెంట్‌‌ ఓకే చెప్పింది. సిడ్నీ క్రికెట్‌‌ గ్రౌండ్‌‌, మనుకా ఓవల్‌‌ స్టేడియాలు వన్డే, టీ20లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ నెల 27న సిడ్నీలో ఫస్ట్‌‌ వన్డే జరగనుంది. 29న రెండో వన్డే, డిసెంబర్‌‌ 2న మూడో వన్డే ఉంటుంది. ఆపై, డిసెంబర్‌‌ 4, 6, 8వ తేదీల్లో మూడు టీ20లు నిర్వహిస్తారు. అదే నెల 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌‌ మొదలవుతుంది. .  ఇండియా–ఆసీస్‌‌ మధ్య ఎప్పుడు మ్యాచ్‌‌ జరిగినా స్టేడియాలు ఫుల్​ అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఫ్యాన్స్‌‌ టికెట్ల కోసం ఎగబడడంతో కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న క్రికెట్‌‌ ఆస్ట్రేలియాకు కొంత రిలీఫ్‌‌ లభించనుంది.

అడిలైడ్‌‌లో ఫస్ట్‌‌ టెస్టుపై పాజిటివ్‌‌ న్యూస్‌‌

అడిలైడ్‌‌లో జరిగే తొలి టెస్టుపై నెలకొన్న అనుమానాలు క్రమంగా తొలగిపోతున్నాయి. కరోనా కేసులు కట్టడి చేసేందుకు సౌత్‌‌ ఆస్ట్రేలియాలో ఆరు రోజుల లాక్‌‌డౌన్‌‌ విధించారు. దాంతోఅడిలైడ్‌‌లోనే టెస్టు మ్యాచ్‌‌ నిర్వహించే అవకాశాలు మరింత మెరుగవుతాయని సౌత్‌‌ ఆస్ట్రేలియా స్టేట్‌‌ టాప్‌‌ మెడికల్‌‌ ఆఫీసర్‌‌ ఒకరు చెప్పారు.  స్టేట్‌‌లో కరోనా పాజిటివ్‌‌ కేసులు ఒక్కసారిగా పెరగడంతో సౌత్‌‌ ఆస్ట్రేలియా తమ బార్డర్స్‌‌ మూసి వేసిన సంగతి తెలిసిందే. దాంతో, ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌‌ టిమ్‌‌ పైన్‌‌ సహా పలువురు క్రికెటర్లు, సపోర్ట్‌‌ స్టాఫ్‌‌ను ప్రత్యేక విమానాల ద్వారా న్యూ సౌత్‌‌ వేల్స్‌‌కు తరలించారు.  సౌత్‌‌ ఆస్ట్రేలియాలో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని ఆ స్టేట్‌‌ చీఫ్‌‌ పబ్లిక్‌‌ హెల్త్‌‌ ఆఫీసర్‌‌ నొకోలా స్పూరియర్‌‌ చెప్పారు. అయితే, అడిలైడ్‌‌లో మ్యాచ్‌‌ను సజావుగా నిర్వహించేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు.

For More News..

బకాయిలు కట్టకపోతే కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తం… కేసులు పెడుతం

జీహెచ్ఎంసీలో ప్రచారం కోసం లీడర్ల చలో హైదరబాద్​

ఏసీబీ దాడులు జరుగుతున్నా మారని పోలీసులు

Latest Updates