పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయాలి: సీఎం

all-vacancies-in-panchayati-raj-department-should-be-filled-cm-kcr

పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సిఇవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను  ఆదేశించారు. పంచాయతీ రాజ్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు నేరుగా నియామకాలు జరుపుతామని చెప్పారు.  ఇవోపిఆర్డీ పోస్టులను ఇకపై మండల పరిషత్ అధికారులుగా పరిగణిస్తామన్నారు.  గ్రామ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డిప్యూటీ సిఇవోలు, డిపిఓలు, సిఇవోలు.. ఇలా అన్ని విభాగాల్లో అవసరమైన వారికి పదోన్నతులు కల్పిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం తెలిపారు.

Latest Updates