‘బాలమిత్ర’ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

 రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్

సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు లేఖ

వరంగల్ , వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి గ్రామాన్ని ‘బాలమిత్ర’గా తీర్చి దిద్దేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చై ర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సర్పం చ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారికి శనివారం లేఖలు రాశారు. కోవిడ్–19 దురదృష్టకరమైన సమస్య అని, దీని ప్రభావం అట్టడుగున ఉన్న పిల్లలపై పడకుం డా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు . గ్రామాలు, పట్టణాల్లోని పేదలపై కరోనా తీవ్ర ప్రభావం చూపి వారి పోషణ కష్టతరమై ఆ భారం పిల్లలు, వారి చదువులపై పడే అవకాశం ఉందన్నారు . పిల్లలకు అండగా నిలిచేందుకు ‘బాలమిత్ర’ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదేనన్నారు.

 

Latest Updates