లీడర్ల కార్ఖానా అలహాబాద్ వర్సిటీ

దేశ రాజకీయాల్లో ఆక్స్ ఫర్డ్ ఆఫ్ ఈస్ట్ గా ఖ్యాతి గడించిన అలహాబాద్ యూనివర్సిటీ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. మిగతా యూనివర్సిటీలు బ్యూరోక్రాట్లను, టెక్నోక్రాట్లను తయారు చేస్తే ఈ యూనివర్సిటీ మాత్రం లీడర్లను తయారుచేస్తోంది.ఇక్కడి స్టూడెంట్ పాలిటిక్స్ లో రాటుదేలిన విద్యార్థులు ఆ తర్వాత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు.చదువు సంధ్యలతో పాటు రాజకీయాలను వంట పట్టించుకున్న ఇక్కడి విద్యార్థులు ఆతర్వాత రాజకీయాల్లో దూసుకుపోయారు. పాఠాలు చెప్పిన ప్రొఫెసర్లు కూడా అంతకంటే రాటుదేలి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి పెద్ద పెద్ద పదవులు చేపట్టారు. ప్రధానులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, కేంద్రమంత్రులు,ముఖ్యమంత్రులు, రాష్ట్రమంత్రులతో పాటు లెక్కనేంత మంది ఎమ్మెల్యే , ఎంపీలను ఈ యూనివర్సిటీ తయారు చేసింది.

ప్రధానులు

ఎనిమిదవ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ తన విద్యార్థి దశలో అలహాబాద్ స్టూడెంట్ యూనియన్ కువైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఆతర్వాత ప్రధానిఅయిన చంద్రశేఖర్ కూడా ఇక్కడి నుంచే పొలిటికల్సైన్స్ లో పీజీ చేశారు.

రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు

రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ రాజకీయాల్లో ఓనమాలు దిద్దింది కూడా ఇక్కడే. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో కి వచ్చి అంచలంచెలుగా కేంద్రమంత్రి, గవర్నర్, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతిగా ఎదిగారు.

కేంద్రమంత్రులు

బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కేంద్రమాజీ మంత్రి మురళీమనోహర్ జోషి ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థే. పి.హెచ్.డి చేసి ఇక్కడే ఫొఫెసర్ గా పాఠాలు చెప్పారు. ఆతర్వాత రాజకీయాల్లోకి వచ్చి అత్యున్నత పదవులు ఎన్నో చేపట్టారు. కేంద్రమాజీ మంత్రులు మదన్ లాల్ ఖురానా, చోటే లోహియాగా ఖ్యాతిగడించిన జనేశ్వర్ మిశ్రా చదువుకున్నది ఇక్కడే.

ముఖ్యమంత్రులు

యూపీ మాజీ సీఎం హేమావతి నందన్ బహుగుణ,ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్.డి.తివారీ చదువుకుంది కూడా ఇక్కడే. మధ్యప్రదేశ్ కురెండు సార్లు సీఎంగా, చాలా సార్లు కేంద్రమంత్రిగా పనిచేసిన అర్జున్ సింగ్ ఇక్కడే రాజకీయ పాఠాలునేర్చుకున్నారు.

ఎంపీ, ఎమ్మెల్యేలకు లెక్కేలేదు

ఏయూలో చదువు పూర్తైన తర్వాత రాజకీయాల్లో కి వచ్చి అవకాశం ఉన్న రాజకీయ పార్టీల్లో చేరిన ఎంతో మంది కాలక్రమంలో ఎమ్మెల్యేలుగా,ఎంపీలుగా ఎన్నికయ్యారు.

తాజా లోక్ సభ ఎన్నికల బరిలో

  •  అలహాబాద్ యూనివర్సిటీలోనే పీహెచ్ డీ చేసి, ఇక్కడే ప్రొఫెసర్ గా పనిచేసిన రీటా బహుగుణ ఇప్పుడు అలహాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగారు.
  • కౌశాంబి నుంచి ఎస్పీ తరపున బరిలోదిగి న మాజీ మంత్రి ఇంద్రజిత్ సరోజ్, బీజేపీ తరపున పోటీ చేస్తు న్న వినోద్ సోన్కార్ ఇద్దరు ఏయూ పూర్వ విద్యార్థులే .
  • ధర్మేం ద్రయాదవ్ బదౌన్ నుంచి లోక్ సభ బరిలో ఉన్నారు.

 

Latest Updates