అల్లరి నరేష్ తో జతకట్టనున్న కాజల్.?

మూడు పదుల వయసు దాటినా.. వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నా కాజల్ అగర్వాల్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ‘భారతీయుడు 2’లో ఒక కీలక పాత్రపోషిస్తోంది. మంచు విష్ణు ప్యాన్ ఇండియా మూవీ‘మోసగాళ్లులో లీడ్ రోల్ చేస్తోంది. బాలీవుడ్ లో ‘ముంబైసాగాకి కమిటయ్యింది. ఇప్పుడు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. నిర్మాత సురేష్ బాబు‘డ్యాన్సింగ్ క్వీన్ ’ అనే కొరియన్ మూవీ రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు. త్వరలో సినిమాని సెట్స్‌‌కి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. ఇందులో క్వీన్‌‌గా కాజల్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారట. అల్లరి నరేష్‌‌ని హీరోగా తీసుకుంటున్నారట. వరుస ఫ్లాపులతో సతమతమైనా ‘మహర్షి’ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు నరేశ్. బంగారుబుల్లోడు, నాంది సినిమాలుచేస్తున్నాడు. కామెడీతో పాటు ఎమోషనల్ పర్‌‌‌‌ఫార్మర్‌‌‌‌గా కూడా మంచి పేరుంది నరేష్‌‌కి. ఇంతకు ముందెప్పుడూ నరేష్‌‌తో ఏ సినిమా చెయ్యలేదు కాజల్. మరి ఈ సినిమాకి కమిట్ మెంట్ ఇస్తుందో లేదో. కానీ పేరున్న బ్యానర్ కనుక, రెమ్యునరేషన్ కూడా భారీగా ఉంటే ఒప్పుకుంటుందేమో అంటున్నారు ఇండస్ట్రీవాళ్లు. చూడాలి ఏం జరుగుతుందో!

Latest Updates