దేశంలోనే తొలి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి అలర్జీ

దేశంలోనే తొలి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి అలర్జీ బారినపడ్డాడు. శనివారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. అయితే ఢిల్లీ ఎయిమ్స్‌లో పనిచేసే సెక్యూరిటీ గార్డు మనీష్ కుమార్ దేశంలోనే మొదటి వ్యాక్సిన్ తీసుకున్నాడు. అయితే మనీష్ అలర్జీ బారనపడినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ప్రస్తుతం మనీష్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

‘ఎయిమ్స్‌లో తొలి టీకా తీసుకున్న మనీష్.. 15 నుంచి 20 నిమిషాల తర్వాత అలర్జీతో స్కిన్ రాషేస్ బారినపడ్డాడు. వెంటనే అతన్ని ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స చేశాం. అతని ఆరోగ్యం కుదుటపడింది. అయినా సరే ఎందుకైనా మంచిదని ఆ వ్యక్తిని రాత్రంతా ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. అతడు ఈ రోజు డిశ్చార్జ్ అవుతాడు’ అని గులేరియా తెలిపారు.

For More News..

పెళ్లి చేయమన్నందుకు కొడుకును చంపిన తండ్రి

దృశ్యం సినిమా స్ఫూర్తితో గర్ల్‌ఫ్రెండ్ మర్డర్.. ఆమె ఫోన్ నుంచి మెసెజ్‌లు చేస్తూ మేనేజ్

ఐదు రోజుల్లో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ కట్టిన్రు

Latest Updates