రోజూ ఒక గంట శారీరక ఆరోగ్యానికి కేటాయించాలి

రోజూ ఒక గంట శారీరక ఆరోగ్యానికి కేటాయించాలి
  • కృష్ణానగర్‌లో ఫిట్‌నెస్ సెంటర్ ప్రారంభం సందర్భంగా వివేక్ వెంకటస్వామి

సికింద్రాబాద్: ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో రోజూ ఒక గంట శారీరక ఆరోగ్యానికి కేటాయించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సూచించారు. మౌలాలి లోని కృష్ణానగర్ లో ఎన్‌డ్యూర్ (ENDURE) ఫిట్‌నెస్ సెంటర్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపి వివేక్ వెంకట స్వామి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సరికొత్త ఎక్విప్ మెంట్ తో  ఎన్‌డ్యూర్(ENDURE ఫిట్ నెస్ సెంటర్‌ని ఏర్పాటు చేసిన జహంగీర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఇంత మంచి ఎక్విప్ మెంట్  ఉన్న ఎన్ డ్యూర్ (ENDURE) ఫిట్ నెస్ సెంటర్ ను మౌలాలి ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. 
ఫిట్‌నెస్ సెంటర్  నిర్వాహకులు జహంగీర్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రస్తుత సమయంలో ఫిట్‌నెస్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది ప్రముఖులకు ఫిట్ నెస్ పై ట్రైనింగ్ ఇస్తున్నానని, 25 లోపు ఉన్న యంగ్ ట్రైనర్స్ మా ఫిట్ నెస్ సెంటర్ లో ఉన్నారని తెలిపారు. వివేక్ వెంకట స్వామి చేతులమీదుగా నా ఫిట్ నెస్ సెంటర్ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.