ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కే బ‌య‌ట‌కు అనుమ‌తి : సీఎం జ‌గ‌న్‌

లాక్‌డౌన్‌ ను మరింత పటిష్టంగా అమలు చేయాలని చేయాలని ఆంధ్రప్రదేశ్  సీఎం జగన్‌… అధికారులను ఆదేశించారు. అర్బన్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సమయం కుదిస్తామని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 నుంచి ఉదయం 11 వరకే నిత్యావసరాలకు పర్మిషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. మిగతా ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి ఒంటిగంట వరకే అనుమతి ఉంటుందన్నారు. నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే జైలుకేనని హెచ్చరించారు సీఎం జగన్. ప్రతి షాపు దగ్గర ధరల పట్టిక, కాల్‌ సెంటర్‌ నెంబర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు, ఆక్వా రైతులకు కనీస గిట్టుబాటు ధరలు అందాలని, వలస కూలీలు, కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామన్నారు. షెల్టర్లలో మెనూ ప్రకారం మంచి భోజనం పెట్టాలని అధికారులను ఆదేశించారు జగన్‌.

Latest Updates